గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 111 శిశుమరణాలు
Sakshi Education
గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో 2019, డిసెంబర్ నెలలో 111 మంది శిశువులు మృత్యువాత పడ్డారు.
దీనితో పాటు అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 88 మంది శిశువులు మరణించారు. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ జనవరి 5న వెల్లడించారు. ప్రజల్లో అవగాహన లేమి, పౌష్ఠికాహారలోపం, చలితీవ్రత ఈ మరణాలకు కారణాలని ఆయన అన్నారు. రెండు దశాబ్దాలతో పోలిస్తే మరణాల సంఖ్య పెరిగిందన్నారు.
శిశుమరణాల గణాంకాలు..
రాజ్‌కోట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 2019, డిసెంబర్‌లో 388 మంది శిశువులు చేరగా, వారిలో 111 మంది మరణించారు. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో 2019, డిసెంబర్‌లో 415 మంది శిశువులు చేరగా, వారిలో 88 మంది మరణించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019, డిసెంబర్ నెలలో 111 మంది శిశువులు మృత్యువాత
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్
ఎక్కడ : రాజ్‌కోట్ జిల్లా, గుజరాత్
మాదిరి ప్రశ్నలు

1. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేయాలని ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
1. అస్సాం
2. పశ్చిమ బెంగాల్
3. తమిళనాడు
4. కేరళ
- View Answer
- సమాధానం : 4
2. జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్ (నేషనల్ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ పైప్‌లైన్-ఎన్ఐపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టులను ఎన్ని రాష్ట్రాల్లో అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు?
1. 22
2. 18
3. 28
4. 14
- View Answer
- సమాధానం : 2
Published date : 06 Jan 2020 06:15PM