Skip to main content

గ్రహాంతర జీవులున్నారు: ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ చీఫ్

విశ్వంలోని ఇతర గ్రహాల్లో జీవులున్నారని(ఏలియన్స్) <b>ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ చీఫ్ హైమ్ యేషెడ్</b> సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
Edu news

ఏలియన్స్ ఉన్నారన్న సంగతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సైతం తెలుసని 87 ఏళ్ల యేషెడ్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

యేషెడ్ తెలిపిన అంశాలు...

  • ఏలియన్స్ తమ ఉనికిని రహస్యంగా ఉంచుతున్నారు. మానవాళి గ్రహాంతర జీవులను నమ్మేందుకు ఇంకా తయారుగా లేనందునే వారు రహస్యంగా ఉంటున్నారు.
  • విశ్వ నిర్మాణాన్ని అధ్యయనం చేయాలని ఏలియన్స్ భావిస్తున్నారు. ఆ మేరకు యూఎస్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు.
  • దీంతో పాటు మార్స్ గ్రహంపై ఒక రహస్య అండర్‌గ్రౌండ్ బేస్ నిర్మాణానికి సైతం అమెరికా, ఏలియన్స్ మధ్య ఒప్పందం ఉంది.
  • మానవాళి విశ్వం, విశ్వ నౌకల గురించి అవగాహన పెంచుకోవాలని గ్రహాంతర జీవుల కోరిక.
  • ఏలియన్స్ ఏర్పాటు చేసిన గెలాక్టిక్ ఫౌండేషన్ సూచన మేరకు ఏలియన్స్ ఉన్నారన్న నిజం తెలిసినా ట్రంప్ బయటకు చెప్పట్లేదు.


ఇజ్రాయెల్ రాజధాని: జెరూసలెం; కరెన్సీ: ఇజ్రాయెలి షెకెల్
ఇజ్రాయెల్ ప్రస్తుత అధ్యక్షుడు: రెయూవేన్ రివీలిన్
ఇజ్రాయెల్ ప్రస్తుత ప్ర‌ధాని: బెంజమిన్ నెతన్యాహూ

Published date : 10 Dec 2020 07:19PM

Photo Stories