Skip to main content

గ్రెటా థెన్‌బర్గ్‌కు రైట్ లైవ్‌లీహుడ్ అవార్డు

పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ‘రైట్ టు లైవ్‌లీహుడ్’ అవార్డుకు ఎంపికైంది.
థన్‌బర్గ్‌తోపాటు అమీనాటౌ హౌదర్(మొరాకో), గువో జియాన్మీ(చైనా), డేవి కోపెనావా(బ్రెజిల్) ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అవార్డు కమిటీ సెప్టెంబర్ 26న వెల్లడించింది.

స్వీడెన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో డిసెంబర్ 4న జరిగే కార్యక్రమంలో వీరికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
  • అమీనాటౌ హౌదర్ : మొరాకో నుంచి ‘వెస్ట్రన్ సహారా’ప్రాంతానికి స్వాతంత్య్రం కోరుతూ అహింసాయుత పోరాటం చేస్తూ ‘గాంధీ ఆఫ్ వెస్ట్రన్ సహారా’గా అమీనాటౌ హౌదర్ పిలవబడుతున్నాడు.
  • గువో జియాన్మీ : న్యాయవాది అయిన గువో జియాన్మీ చైనాలో మహిళల గృహహింసపై పోరాడుతున్నారు.
  • డేవి కోపెనావా : అమెజాన్ అడవిని, అక్కడి ప్రజలను రక్షించడంలో చేస్తున్న కృషికిగాను బ్రెజిల్ దేశీయ తెగకు చెందిన న్యాయవాది డేవి కోపెనావా, హుటుకారా యనోమామి అసోసియేషన్ (బ్రెజిల్) సంస్థకు సంయుక్తంగా లైవ్‌లీహుడ్ అవార్డు ఇవ్వనున్నారు.
  • నోబెల్ బహుమతి మానవ సమస్యలపై పోరాడుతున్న వారికి దక్కడం లేదంటూ 1980లో జర్మన్-స్వీడిష్ రచయిత జాకబ్ వాన్ యుయెక్స్‌కుల్ ‘రైట్ లైవ్‌లీహుడ్ అవార్డు’ను స్థాపించారు. నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయంగా దీనిని పిలుస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రైట్ టు లైవ్‌లీహుడ్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : గ్రెటా థన్‌బర్గ్, అమీనాటౌ హౌదర్, గువో జియాన్మీ, డేవి కోపెనావా
Published date : 27 Sep 2019 05:25PM

Photo Stories