గ్రాట్యుటీ పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు
Sakshi Education
ఆదాయ పన్ను చట్టం-1961 సెక్షన్ 10 (10)(3) ప్రకారం గ్రాట్యుటీపై ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థిక శాఖ రెట్టింపు చేసిందని కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ మార్చి 7న తెలిపారు.
ఇప్పటి వరకు రూ.10 లక్షలు ఆపైన గ్రాట్యుటీపై ఆదాయ పన్ను భారం పడుతుండగా ఇకపై రూ.20 లక్షల వరకు ఈ పరిమితి పెరగనుంది. ఈ నిర్ణయం అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్రం 2018 మార్చిలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక పరిస్థితులు, సంస్థల చెల్లింపు సామర్థ్యం, ఉద్యోగుల వేతనం ఆధారంగా గ్రాట్యుటీ చెల్లింపు పరిమితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రాట్యుటీ పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రాట్యుటీ పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ
Published date : 08 Mar 2019 04:43PM