గోదావరి-కృష్ణా-పెన్నా పనులు నిలుపుదల
Sakshi Education
గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మే 31న ఆదేశాలిచ్చింది.
నదుల అనుసంధాన పనులకు పర్యావరణ అనుమతులు లేవని, ఆ అనుమతులు వచ్చేవరకూ ఎటువంటి పనులూ చేపట్టకూడదంటూ పేర్కొంది. ఈ నదుల అనుసంధానానికి గత ఏపీ ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన పనులు నిలుపుదల
ఎప్పుడు : మే 31
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)
ఎందుకు : పర్యావరణ అనుమతులు లేని కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన పనులు నిలుపుదల
ఎప్పుడు : మే 31
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)
ఎందుకు : పర్యావరణ అనుమతులు లేని కారణంగా
Published date : 01 Jun 2019 05:35PM