Skip to main content

గిరిజన చిన్నారులకు అండగా నిలిచేందుకు సచిన్ టెండూల్కర్ ఏ సంస్థతో జత కట్టాడు?

ఆర్థికంగా వెనుకబడిన గిరిజన చిన్నారులకు అండగా నిలిచేందుకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముందుకు వచ్చాడు.
Current Affairs
మధ్యప్రదేశ్‌కు చెందిన ‘ఎన్జీవో పరివార్’ భాగస్వామ్యంతో అతను వారికి సహకారం అందించనున్నాడు. సచిన్ ఇచ్చే చేయూత వల్ల 560 మంది చిన్నారులకు చదువు, పౌష్టికాహారం లభిస్తాయి .

యూఏఈ క్రికెటర్లపై నిషేధం
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. యూఏఈకి చెందిన ఆమిర్ హయత్, అష్ఫాఖ్ అహ్మద్‌లపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు సెప్టెంబర్ 13న ప్రకటించింది. అష్ఫాఖ్ 16 వన్డేలు, 12 టి20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, హయత్ 8 వన్డేలు 4 టి20లు ఆడాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఎన్జీవో పరివార్తో భాగస్వామ్యం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్
ఎందుకు : ఆర్థికంగా వెనుకబడిన గిరిజన చిన్నారులకు అండగా నిలిచేందుకు
Published date : 19 Sep 2020 11:52AM

Photo Stories