గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించిన ఉంగరం పేరు?
Sakshi Education
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన నగల దుకాణదారు హర్షిత్ బన్సాల్ 12,638 వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారు చేశాడు.
8 పొరలతో 165.45 గ్రాముల బరువున్న ఉంగరానికి ‘మారిగోల్డ్ డైమండ్ రింగ్’ అనే పేరు పెట్టారు. అత్యధిక సంఖ్యలో వజ్రాలు పొదిగిన ఉంగరంగా ‘మారిగోల్డ్ డైమండ్ రింగ్’ గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించింది.
ఇప్పటివరకు హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి కొట్టి శ్రీకాంత్ పేరిటి ఈ రికార్డు ఉండేది. 7,801 వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని శ్రీకాంత్ తయారు చేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మారిగోల్డ్ డైమండ్ రింగ్‌కు గిన్నిస్ రికార్డుల్లో స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 5
ఎవరు : హర్షిత్ బన్సాల్
ఎక్కడ : ప్రపంచంలో
ఎందుకు : అత్యధిక సంఖ్యలో వజ్రాలు(12,638 వజ్రాలు) పొదిగినందున
Published date : 09 Dec 2020 02:59PM