Skip to main content

గగన్‌యాన్ వ్యోమగాములకు శిక్షణ ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’లో పాల్గొనబోయే నలుగురు భారతీయ వ్యోమగాములకు శిక్షణ ప్రారంభమైంది.
Current Affairsరష్యా రాజధాని మాస్కోలోని ‘గగరీన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్(జీసీటీసీ)’లో ఫిబ్రవరి 10న ఈ నలుగురికి శిక్షణ మొదలైంది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన శిక్షణ సంస్థ గ్లావ్‌కాస్మోస్ వెల్లడించింది. ఏడాదిపాటు వీరికి భౌతిక శిక్షణతోపాటు బయోమెడికల్ రంగంలోనూ శిక్షణ ఉంటుందని పేర్కొంది. రష్యా అంతరిక్ష నౌక సోయుజ్‌లోని వ్యవస్థలను కూడా వ్యోమగాములు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారని వివరించింది.

భారతీయ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు గ్లావ్‌కాస్మోస్, ఇస్రోకు చెందిన హ్యూమన్ స్పేస్‌ఫ్లయిట్ సెంటర్‌ల మధ్య 2019 ఏడాది ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. గగన్‌యాన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇస్రోనే నలుగురు ఎయిర్‌ఫోర్స్ పెలైట్లను ఎంపిక చేసింది. ఇప్పుడు వీరికే రష్యాలో శిక్షణ మొదలైంది. మరోవైపు గగన్‌యాన్ ప్రాజెక్ట్ 2022లో జరగనున్నట్లు ఇప్పటికే ఇస్రో ప్రకటించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గగన్‌యాన్ వ్యోమగాములకు శిక్షణ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : గ్లావ్‌కాస్మోస్
ఎక్కడ : గగరీన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్(జీసీటీసీ), మాస్కో, రష్యా
Published date : 12 Feb 2020 05:55PM

Photo Stories