గాంధీ శాంతి పురస్కారాల ప్రదానం
Sakshi Education
2015, 2016, 2017, 2018 సంవత్సరాలకుగాను ప్రకటించిన గాంధీ శాంతిపురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు.
ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో ఫిబ్రవరి 26న నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. కన్యాకుమారిలోని ‘వివేకానంద కేంద్ర’కు 2015 ఏడాదికిగాను అవార్డు లభించింది. అక్షయపాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా 2016 ఏడాదికిగాను అవార్డును అందుకున్నాయి. అలాగే ఏకల్ అభియాన్ ట్రస్టుకు 2017 ఏడాదికిగాను, బహూకరించారు. కుష్టు వ్యాధి నిర్మూలన కోసం కృషిచేస్తున్న నిప్పన్ ఫౌండేషన్ చైర్మన్, జపాక్‌కు చెందిన యోహియే ససాకవాకు 2018కి బహుమతిని అందజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2015, 2016, 2017, 2018 గాంధీ శాంతి పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతిభవన్, ఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2015, 2016, 2017, 2018 గాంధీ శాంతి పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతిభవన్, ఢిల్లీ
Published date : 27 Feb 2019 05:45PM