Skip to main content

ఎయిర్‌క్రాఫ్ట్ సవరణ బిల్లుకి పార్లమెంటు ఆమోదం

పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థలైన డీజీసీఏ, బీసీఏఎస్, ఏఏఐబీ మొదలైన వాటికి మరిన్ని అధికారాలు, చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లు 2020ని మార్చి 17న పార్లమెంటు ఆమోదించింది.
Current Affairsవిమానయాన రంగ సంస్థలు .. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో విధించే జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. కరోనా వైరస్ పరమైన సవాళ్ల నుంచి విమానయాన రంగం సత్వరం బైటికి రాగలదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ పురి ధీమా వ్యక్తం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లు 2020కి ఆమోదం
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : పార్లమెంటు
ఎందుకు : డీజీసీఏ, బీసీఏఎస్, ఏఏఐబీ వంటి పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు
Published date : 18 Mar 2020 06:19PM

Photo Stories