ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సాల్
Sakshi Education
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు సీఎండీగా సీనియర్ ప్రభుత్వ అధికారి రాజీవ్ బన్సాల్‌ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13న నియమించింది.
నాగాలాండ్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ బన్సాల్.. గతంలో విజయవంతంగా సంస్థను నడిపించారు. 2017లో మూడు నెలలపాటు మధ్యంతర ఎయిర్ ఇండియా సీఎండీగా సేవలందించారు. ఆ సమయంలో వ్యయాలను గణనీయంగా తగ్గించి, సమయానికి విమానాలు నడిచేలా చేశారు. దీంతో ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఆయన్ని మళ్లీ నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎయిర్ ఇండియాకు సీఎండీగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : రాజీవ్ బన్సాల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎయిర్ ఇండియాకు సీఎండీగా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : రాజీవ్ బన్సాల్
Published date : 14 Feb 2020 05:44PM