ఎవరి స్మారకార్థం ముద్రించిన రూ. 100 నాణేంను ప్రధాని ఆవిష్కరించారు?
Sakshi Education
గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా శతజయంతి వేడుకల సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ ముద్రించిన వంద రూపాయల నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 12న వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు.
నాణేనికి ఓ వైపు రాజమాత బొమ్మ మరోవైపు అశోకుడి స్థూపం ఉంటుంది. రాజమాత బొమ్మ ఉన్న వైపు..సింధియా వందవ జయంతి అని హిందీ, ఆంగ్లభాషల్లో రాసి ఉంటుంది.
వంద రూపాయల నాణెం ఆవిష్కరణ అనంతరం ప్రధాని మాట్లాడుతూ... స్వాతంత్ర్య ఉద్యమకాలం నాటినుంచి భారత రాజకీయాల్లో రాజమాత కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు అధికారం కన్నా ప్రజాసేవే ముఖ్యమనే విషయాన్ని ఆమె నిరూపించారని కొనియాడారు. ఏక్తాయాత్ర సమయంలో సింధియానే తనను గుజరాత్ యువ నాయకుడిగా పరిచయం చేశారన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఆర్థికశాఖ ముద్రించిన వంద రూపాయల నాణేం ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా శతజయంతి వేడుకల సందర్భంగా
Published date : 13 Oct 2020 07:08PM