Skip to main content

ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశానికి వేదికైన నగరం?

రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబర్ 4న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశం జరిగింది.
Current Affairs

ఈ సమావేశంలో రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగు, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెన్‌ఘీ పాల్గొన్నారు. ఎస్‌సీఓలో భారత్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 40 శాతం ఉంటుంది.

భేటీలో రాజ్‌నాథ్ ప్రసంగం-ముఖ్యాంశాలు

  • పరస్పర విశ్వాసపూరిత వాతావరణం, దురాక్రమణ రహిత విధానం, అంతర్జాతీయ నిబంధనల అమలు, శాంతియుతంగా విభేదాల పరిష్కారం.. తదితర విధానాలను అవలంబించడం ద్వారానే ఎస్‌సీఓ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయి.
  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సైబర్ టైజానికి వ్యతిరేకంగా ఎస్‌సీఓ ‘రీజనల్ యాంటీ టైజం స్ట్రక్చర్ (ర్యాట్స్)’చేపట్టిన చర్యలను భారత్ ప్రశంసిస్తోంది.
  • ‘పీస్ మిషన్’పేరుతో ఉగ్రవాద వ్యతిరేక వార్షిక సదస్సును చేపట్టడంపై రష్యాకు కృతజ్ఞతలు.
  • అఫ్గాన్ నియంత్రణలో, అఫ్గాన్ నేతృత్వంలో సాగే సమ్మిళిత శాంతి ప్రక్రియకు భారత్ సహకారం అందించడం కొనసాగిస్తుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎక్కడ : మాస్కో, రష్యా
Published date : 05 Sep 2020 05:12PM

Photo Stories