‘ఎఫ్‌ఐహెచ్’ సిరీస్‌లో భారత్ విజేత
Sakshi Education
సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చలాయించిన భారత పురుషుల హాకీ జట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించింది.
జూన్ 15న జరిగిన ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 5-1 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ, 25వ నిమిషాల్లో), వరుణ్ కుమార్ (2వ, 49వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ సాధించగా... వివేక్ ప్రసాద్ (35వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున రిచర్డ్ పౌట్జ్ (53వ నిమిషంలో) ఏకై క గోల్ సాధించాడు. తుది ఫలితంతో సంబంధం భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లలో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 4-2తో అమెరికాను ఓడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా భారత్
ఎప్పుడు: జూన్ 15
ఎక్కడ: భువనేశ్వర్
క్విక్ రివ్యూ:
ఏమిటి: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా భారత్
ఎప్పుడు: జూన్ 15
ఎక్కడ: భువనేశ్వర్
Published date : 17 Jun 2019 06:12PM