ఏప్రిల్ 24 నుంచి ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు
Sakshi Education
వైరస్‌లు, అంటురోగాల బారిన పడకుండా మానవ శరీరాన్ని కాపాడే వ్యాక్సిన్ విలువ వెలకట్టలేనిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది.
ప్రపంచంలో దాదాపు 2 కోట్ల మంది చిన్నారులకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ వ్యాక్సిన్ల విలువను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చింది. 2020, ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు నిర్వహించాలని పేర్కొంది. ఈ వారోత్సవాల్లో మానవ శరీరాన్ని రోగనిరోధకంగా మార్చేందుకు అవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలను మానవాళికి తెలపాలని సూచించింది. ‘వ్యాక్సిన్ ఫర్ ఆల్’ నినాదంతో ముందుకెళ్లాలని, ప్రపంచంలో అందుబాటులోకి రావాల్సిన అన్ని రకాల వైద్య సదుపాయాలను ప్రజలకు తెలపాలని పిలుపునిచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : వ్యాక్సిన్ల విలువను ప్రపంచానికి చాటి చెప్పాలని
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ప్రపంచ రోగనిరోధక వారోత్సవాలు
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎందుకు : వ్యాక్సిన్ల విలువను ప్రపంచానికి చాటి చెప్పాలని
Published date : 16 Apr 2020 06:00PM