ఏపీలోని ఏ జిల్లాలో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ వర్సిటీ, రిక్రియేషన్ సెంటర్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ వర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5న సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రూ.14,634 కోట్లతో సుమారు 25 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. 130 ఎకరాల్లో ప్రాజెక్టు చేపట్టనున్నారు.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు...
- వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద నిర్దేశించిన 2059 సేవలు ప్రస్తుతం రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అమలవుతున్నాయి. ఈ సేవలు మిగతా ఆరు జిల్లాల్లో కూడా 2020, నవంబర్ 10 నుంచి అందుబాటులోకి వస్తాయి.
- అగ్నిమాపక శాఖలో జోనల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పుడున్న రెండు జోన్లు నాలుగు జోన్లుగా మార్పు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ వర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 06 Nov 2020 06:01PM