ఏపీలో ట్రాఫిక్ వాట్సాప్ నంబర్ విడుదల
Sakshi Education
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను నడిపేవారిని పౌరులే గుర్తించి ప్రభుత్వానికి పట్టించేందుకు వీలుగా వాట్సాప్ నంబరు 9542800800ను ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విడుదల చేశారు.
విజయవాడలోని రవాణా శాఖ కమిషనరేట్‌లో ఆగస్టు 28న నిర్వహించిన కార్యక్రమంలో ఈ వాట్సాప్ నంబర్‌ను మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే.. స్పష్టంగా ఫొటో తీసి వాట్సాప్ నంబరుకు పంపితే నేరుగా వారి ఇంటికే జరిమానా చలానా పంపేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రహదారి భద్రతకు రూ.50 కోట్లు కేటాయించామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ట్రాఫిక్ వాట్సాప్ నంబర్ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను నడిపేవారిని పౌరులే గుర్తించి ప్రభుత్వానికి పట్టించేందుకు వీలుగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ట్రాఫిక్ వాట్సాప్ నంబర్ విడుదల
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను నడిపేవారిని పౌరులే గుర్తించి ప్రభుత్వానికి పట్టించేందుకు వీలుగా
Published date : 29 Aug 2019 06:07PM