Skip to main content

ఏపీలో కోవిడ్‌–19 టెస్టు కిట్ల ఆవిష్కర‌ణ‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త‌యారైన కోవిడ్‌–19 ర్యాపిడ్‌ టెస్టు కిట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.
Current Affairs
సీఎం క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 8న జ‌రిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... కోవిడ్‌–19 ర్యాపిడ్‌ టెస్టు కిట్ల తయారీలో రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని అన్నారు. విశాఖపట్నంలోని మెడ్‌టెక్‌ జోన్‌లో మోల్‌ బయో సంస్థ త్రీడీ ప్రింటింగ్‌ ల్యాబొరేటరీలో ఈ కిట్లను త‌యారు చేస్తోంది. టెస్ట్‌ కిట్ల తయారీ, పనిచేసే విధానాన్ని మెడ్‌టెక్‌ జోన్‌ సీఈఓ డా.జితేంద్ర శర్మ, సిబ్బంది ముఖ్యమంత్రికి వివరించారు.

ఐసీఎంఆర్ అనుమతి...

దేశంలోనే తొలిసారిగా కరోనా వైరస్‌ నిర్ధారించే ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను తయారు చేయడం ద్వారా ఏపీ రికార్డు సృష్టించింద‌ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు. విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌లో అభివృద్ధి చేసిన ఈ కిట్లకు ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతి లభించిందని తెలిపారు. "బహిరంగ మార్కెట్‌లో ఈ కిట్‌ ధర రూ. 4,500 ఉండగా కేవలం రూ. 1,200కే అందజేస్తున్నాం. ఒక్కో కిట్‌ ద్వారా రోజుకు 20 టెస్టులు చేయవచ్చు. కేవలం 55 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవచ్చు. బ్యాటరీ ఆధారంగా ప‌ని చేసే ఈ కిట్లను మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లవచ్చు" అని మంత్రి పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కోవిడ్‌–19 ర్యాపిడ్‌ టెస్టు కిట్ల ఆవిష్కర‌ణ‌
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 09 Apr 2020 05:07PM

Photo Stories