Skip to main content

ఏపీలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రెండు రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు.
Current Affairsజనవరి 4, 5 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా 3,636 మందికి పైగా బాలబాలికలను రక్షించారు. రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు, అనాథలకు పునరావాసం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులతోపాటు మహిళా శిశు సంక్షేమ, కార్మిక, విద్యా, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, క్రీడా శాఖలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, శిశు సంరక్షణ కమిటీలు కూడా భాగస్వాములయ్యాయి.

ఆపరేషన్ ముస్కాన్ అంటే..
తల్లిదండ్రులు లేక కొందరు, ఇంటి నుంచి పారిపోయి వచ్చినవారు మరికొందరు అనాథల్లా జీవితం గడుపుతుంటారు. ఇలాంటివారిని రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో బహిరంగ ప్రదేశాల్లో గుర్తించడానికి పోలీసు బృందాలు, బాలల స్వచ్ఛంద సంస్థలు చేపట్టే కార్యక్రమాన్నే ఆపరేషన్ ముస్కాన్ అంటారు.

తెలంగాణలో ఆపరేషన్ స్మైల్
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తప్పిపోయిన చిన్నారులను, బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు చేపట్టిన కార్యక్రమమే ఆపరేషన్ స్మైల్.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణ
ఎప్పుడు : జనవరి 4, 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ పోలీసులు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
ఎందుకు : తప్పిపోయిన పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు, అనాథలకు పునరావాసం కల్పించేందుకు

మాదిరి ప్రశ్నలు
Published date : 06 Jan 2020 06:05PM

Photo Stories