ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా నియమితులైన అధికారి?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) ఎండీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు.
ఈ మేరకు మే 31న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీ, వీసీగా చేసిన ఆర్‌పీ ఠాకూర్ మే 31న పదవీ విరమణ చేశారు.ఖాళీ అయిన ఆ పోస్టులో రైల్వే డీజీగా ఉన్న ద్వారకాతిరుమల రావును ప్రభుత్వం నియమించింది. మరోవైపు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్.సంజయ్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఏపీ పోలీస్ ఏడీజీగా ఉన్న సంజయ్ పూర్తి అదనపు బాధ్యతలతో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) ఎండీగానియమితులైన అధికారి?
ఎప్పుడు : మే 31
ఎవరు : సీహెచ్ ద్వారకా తిరుమలరావు
ఎందుకు :ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీ, వీసీగా చేసిన ఆర్‌పీ ఠాకూర్ మే 31న పదవీ విరమణ చేయడంతో...క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) ఎండీగానియమితులైన అధికారి?
ఎప్పుడు : మే 31
ఎవరు : సీహెచ్ ద్వారకా తిరుమలరావు
Published date : 01 Jun 2021 06:15PM