ఏపీ, తెలంగాణలకు డిజిటల్ ఇండియా అవార్డులు
Sakshi Education
వివిధ విభాగాల్లో మెరుగైన సాంకేతిక సేవలకుగాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు డిజిటల్ ఇండియా అవార్డులు దక్కాయి.
అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 22న ఢిల్లీలో జరిగింది. భూ రికార్డుల్లో పారదర్శకత పాటించినందుకు ఏపీకి దక్కిన గోల్డ్ అవార్డును కేంద్ర మంత్రి రవి శంకర్‌ప్రసాద్ చేతుల మీదుగా సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ చెరుకూరి అందుకున్నారు. బెస్ట్ మొబైల్ యాప్ విభాగంలో (మీ సేవ) ఏపీకి దక్కిన సిల్వర్ అవార్డును మీ సేవ డిప్యూటీ డెరైక్టర్ ముత్తు రామస్వామి అందుకున్నారు. స్పెషల్ మెన్షన్ అవార్డు విభాగంలో ఏపీ రెరాకు దక్కిన అవార్డును ఆ శాఖ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీధర్ పోపురి అందుకున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి.. మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌కు వెబ్త్న్ర అవార్డు, ఔట్ స్టాండింగ్ డిజిటల్ ఇనిషియేటివ్ బై లోకల్ బాడీ కింద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్లాటినం అవార్డు, బెస్ట్ మొబైల్ యాప్ విభాగంలో టీ యాప్ ఫోలియోకి సిల్వర్ అవార్డులు దక్కాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఏపీ, తెలంగాణలకు డిజిటల్ ఇండియా అవార్డులు
ఎప్పుడు : ఫిబ్రవరి 22న
ఎందుకు : మెరుగైన సాంకేతిక సేవలకుగాను
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఏపీ, తెలంగాణలకు డిజిటల్ ఇండియా అవార్డులు
ఎప్పుడు : ఫిబ్రవరి 22న
ఎందుకు : మెరుగైన సాంకేతిక సేవలకుగాను
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 23 Feb 2019 06:02PM