Skip to main content

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ జనరల్‌గా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
ప్రధాన భూ పరిపాలన కమిషనర్‌గా(సీసీఎల్‌ఏ) పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు నవంబర్ 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 బ్యాచ్‌కి చెందిన ఎల్వీ సుబ్రమణ్యం 2019, ఏప్రిల్ 6న ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. 2020 ఏప్రిల్‌లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
Published date : 05 Nov 2019 05:33PM

Photo Stories