Skip to main content

ఏపీ సీఎంతో తమిళనాడు మంత్రుల భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్‌పీ వేలుమణి, మంత్రి జయకుమార్, ముఖ్య కార్యదర్శి మనివాసన్ భేటీ అయ్యారు.
అమరావతిలో ఆగస్టు 9న జరిగిన ఈ సమావేశంలో తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని, అందుకు నీటిని విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్‌కు తమిళనాడు మంత్రలు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ చెన్నై తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్‌పీ వేలుమణి, మంత్రి జయకుమార్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని
Published date : 10 Aug 2019 07:28PM

Photo Stories