ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా ముత్యాలరాజు
Sakshi Education
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ముత్యాలరాజు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్... ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఎండీగా ఎన్.బంగారురాజును ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
స్టార్ నెట్‌వర్క్‌కే ప్రొ కబడ్డీ లీగ్ హక్కులు
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) హక్కుల్ని స్టార్ నెట్‌వర్కే తిరిగి కైవసం చేసుకుంది. ఏడాదికి రూ. 180 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు పొందింది. 2019 ఏడాది రూ. 90 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తం. కరోనా కారణంగా 2020లో పీకేఎల్ జరగలేదు. గత ఏడేళ్లుగా స్టార్ టీవీ చానెళ్లలోనే ఈ కబడ్డీ పోటీలు ప్రసారం అవుతున్నాయి.
సంభవ్ సదస్సులో గడ్కరీ...
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ నిర్వహించిన సంభవ్ సదస్సులో కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలను వచ్చే ఆరు నెలల్లో దేశీయంగానే పూర్తి స్థాయిలో తయారీ చేయగలమని గడ్కరీ చెప్పారు.

Published date : 19 Apr 2021 06:16PM