ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా ఏపీ కేడర్ అధికారి నీలం సహానిని నియమిస్తూ నవంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ప్రభుత్వ సీఎస్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీసీఏల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను రిలీవ్ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఓ మహిళా ఐఏఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడం ఇదే తొలిసారి. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సహాని 1960, జూన్ 20న జన్మించారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సహానిని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు నవంబర్ 11న ఆ విధుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లలో సీనియర్ అయిన ఆమె 2020, జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : నీలం సహాని
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : నీలం సహాని
Published date : 14 Nov 2019 05:32PM