ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులు రద్దు
Sakshi Education
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, ప్రభుత్వ విప్ హోదాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
రాష్ట్ర శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడంతో సీఎం పదవికి చంద్రబాబునాయుడు రాజీనామా చేసిన విషయం విదితమే. సీఎం రాజీనామా చేస్తే మంత్రి మండలితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలు కూడా రద్దవుతాయి. ఇదే ప్రకారం శాసనసభలో చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ విప్‌లు చింతమనేని, కూన రవికుమార్, యామినీ బాల, పీజీవీఆర్ నాయుడు, అత్తర్ చాంద్ బాషా, మండలిలో చీఫ్ విప్ పయ్యావుల, విప్‌లు డొక్కా, బుద్దా పదవులు కోల్పోయారు. ఈమేరకు జీవో జారీ కావాల్సి ఉన్నందున ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరందరి హోదాలు మే25 నుంచి రద్దయినట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం జూన్ 3న ఉత్తర్వులిచ్చారు.
Published date : 04 Jun 2019 05:37PM