ఏపీ పోలీసులకు హోం ఎక్సలెన్స్ అవార్డు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్ జె.శివనారాయణ స్వామి, ఏఎస్‌ఐ ఎస్.స్వామిదాస్‌లకు కేంద్ర హోంశాఖ అందించే ‘ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్-2019’ అవార్డు లభించింది.
నేరాల దర్యాప్తులో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకుగాను వీరికి ఈ అవార్డు దక్కింది. అదే విధంగా సీబీఐ విభాగం నుంచి తెలుగు అధికారి డీఎస్పీ బండి పెద్దిరాజు, తెలంగాణ పోలీసు విభాగం నుంచి ఏసీపీ ఏవీఆర్ నర్సింహారావు, ఏసీపీ ఎస్.మోహన్‌కుమార్‌లకూ ఈ అవార్డు లభించింది. 2018 నుంచి ఈ అవార్డు ఇస్తుండగా, 2019 ఏడాదికి మొత్తం 96 మంది ఎంపికయ్యారు.
Published date : 14 Aug 2019 07:07PM