Skip to main content

ఏపీ న్యాయ సమీక్ష బిల్లుకు గవర్నర్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల(ముందస్తు న్యాయ పరిశీలన)బిల్లు-2019కు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆగస్టు 20న ఆమోదం తెలిపారు.
దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. టెండర్ల విధానంలో అవినీతి, అక్రమాలకు చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువగల పనులకు సంబంధించిన వివరాలను ముందుగా హైకోర్టు న్యాయమూర్తికి పంపి, ఆయన సూచనల మేరకు మార్పులు చేయాలి.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి : ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల(ముందస్తు న్యాయ పరిశీలన)బిల్లు-2019కు ఆమోదం
 ఎప్పుడు  : ఆగస్టు 20
 ఎవరు  : ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
Published date : 21 Aug 2019 06:06PM

Photo Stories