ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్
దీంతో ప్రస్తుతం ఎస్‌ఈసీగా పని చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్థానంలో జస్టిస్ కనగరాజ్ ఏప్రిల్ 11న బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా నియమించేలా పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్‌కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోద ముద్రవేశారు. తాజా చట్టం ద్వారా ప్రస్తుతం ఐదేళ్లుగా ఉన్న ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించారు.
తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్
Published date : 11 Apr 2020 05:53PM