Skip to main content

ఏపీ జెన్‌కో చైర్మన్‌గా సాయిప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ(ఏపీజెన్‌కో) బోర్డు చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది.
Current Affairsఈ మేరకు మార్చి 11న ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాయిప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీగా ఉన్నారు. జెన్‌కో బోర్డు చైర్మన్‌గా ఇప్పటి వరకూ ట్రాన్స్‌కో ఎండీ శ్రీకాంత్ ఉన్నారు.

సీఎం వైఎస్ జగన్‌తో కెనడా కాన్సుల్ జనరల్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్, కాన్సుల్ సీనియర్ ట్రేడ్ కమిషనర్ మార్క్ ష్రోటర్, ట్రేడ్ కమిషనర్ విక్రం జైన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో మార్చి 11న జరిగిన ఈ భేటీలో.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాల గురించి సీఎం వారికి వివరించారు. వివిధ రంగాల్లో అవకాశాలను గుర్తించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని గిరార్డ్ తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ(ఏపీజెన్‌కో) బోర్డు చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : జి. సాయిప్రసాద్
Published date : 13 Mar 2020 05:38PM

Photo Stories