ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించింది.
ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జూలై 30న ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు తీర్పు మేరకు ఆయనను తిరిగి ఆ పదవిలో నియమిస్తున్నట్లు తొలుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్‌ను జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవు పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) తుది తీర్పుకు లోబడి ఈ నియామకం కొనసాగుతుందని గవర్నర్ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియామకం
ఎప్పుడు : జూలై 30
ఎవరు : నిమ్మగడ్డ రమేష్కుమార్క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియామకం
ఎప్పుడు : జూలై 30
Published date : 01 Aug 2020 12:59PM