Skip to main content

ఎన్‌సీసీ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో జనవరి 28న జరిగిన ప్రధానమంత్రి నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
Current Affairs పాకిస్తాన్‌ను మట్టికరిపించడానికి భారత సైనిక దళాలకు వారం, పది రోజుల కన్నా ఎక్కువ సమయం పట్టదని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. మూడు యుద్ధాల్లో ఓడిపోయినా పాక్ తీరు మారలేదన్నారు. భారత్‌తో పరోక్ష యుద్ధాలకు ప్రయత్నిస్తోందన్నారు.

పొరుగు దేశాల్లో మతపరమైన మైనారిటీలకు జరిగిన అన్యాయాలను సరిచేసే ప్రయత్నంలో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తీసుకువచ్చామని మోదీ అన్నారు. వారికి గతంలో భారత్ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఈ చట్టం రూపొందించామని వివరించారు. 1950లో నాటి భారత, పాకిస్తాన్ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లియాఖత్ అలీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

పొటాటో కాంక్లేవ్‌ను ఉద్దేశించి ప్రసంగం
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో జరుగుతున్న ‘గ్లోబల్ పొటాటో కాంక్లేవ్’ను ఉద్దేశించి జనవరి 28న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా ప్రసంగించారు. ఆలుగడ్డల ఉత్పత్తి, ఎగుమతికి గుజరాత్ ప్రధాన కేంద్రంగా మారిందన్నారు. గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా ఆలుగడ్డల ఉత్పత్తి 20 శాతం పెరగగా, గుజరాత్‌లో 170 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ‘సుజలాం, సుఫలాం’, ‘సౌని యోజన’ తదితర పథకాల వల్ల రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు సైతం నీటి పారుదల సౌకర్యం లభించిందన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) ర్యాలీని ఉద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 29 Jan 2020 06:04PM

Photo Stories