Skip to main content

ఎనిమిది కేబినెట్ కమిటీలు ఏర్పాటు

కేంద్రప్రభుత్వం ఎనిమిది కీలక మంత్రివర్గ సంఘాలను (కేబినెట్ కమిటీ) ఏర్పాటుచేసింది.
ఈ కమిటీల్లో కొన్నిటికి ప్రధాని నరేంద్ర మోదీ, మరికొన్నిటికి హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షులుగా ఉన్నారు. మొత్తం ఎనిమిది కమిటీల్లో అమిత్‌షాకు స్థానం లభించగా... ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరు కమిటీల్లో చోటు దక్కించుకున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటయిన ఆరు మంత్రివర్గ సంఘాలను ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరించారు. వీటితో పాటు పెట్టుబడి, ఆర్థిక వృద్ధి, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలపై కొత్తగా రెండు కమిటీలను ఏర్పాటు చేశారు.

ఎనిమిది కేబినెట్ కమిటీలు-సభ్యలు
భద్రత వ్యవహారాలు (సీసీఎస్):
ప్రధాని నరేంద్ర మోదీ; రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాక మంత్రి ఎస్. జయశంకర్.

నియామకాల కేబినెట్ కమిటీ (సీసీఏ): ప్రధాని నరేంద్ర మోదీ; హోం శాఖ మంత్రి అమిత్ షా

రాజకీయ వ్యవహారాలు (సీసీపీఏ): మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, నిర్మల, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, హర్షవర్ధన్, పీయూష్ గోయల్, అరవింద్ సావంత్, ప్రహ్లాద్ జోషి


మౌలిక సౌకర్యాలు: అమిత్ షా, గడ్కరీ, నిర్మల, పీయూష్ గోయల్, ప్రత్యేక ఆహ్వానితులుగా జితేంద్ర సింగ్, హర్దీప్ సింగ్ పురి

ఆర్థిక వ్యవహారాలు: మోదీ, రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీ, సదానంద గౌడ, నిర్మల, నరేంద్ర సింగ్ తోమర్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, రవిశంకర్ ప్రసాద్, ఎస్.జైశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్

పార్లమెంటరీ వ్యవహారాలు: అమిత్ షా, రాజ్‌నాథ్, నిర్మల, రాంవిలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, తావర్ చంద్ గెహ్లాట్, ప్రకాశ్ జావడేకర్, ప్రహ్లాద్ జోషి, ప్రత్యేక ఆహ్వానితులుగా అర్జున్ రామ్ మేఘ్‌వాల్, మురళీధరన్

ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు: మోదీ, రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీ, నిర్మల, పీయూష్ గోయల్

ఉపాధి, నైపుణ్యాభివృద్ధి: మోదీ, రాజ్‌నాథ్, అమిత్ షా, నిర్మల, నరేంద్రసింగ్ తోమర్, రమేశ్ పోఖ్రియాల్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, మహేంద్రనాథ్ పాండే, సంతో్‌షకుమార్ గంగ్వార్, హర్దీప్ సింగ్ పురి. ప్రత్యేక ఆహ్వానితులుగా గడ్కరీ, హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్, స్మృతి ఇరానీ, ప్రహ్లాద్ సింగ్ పటేల్.

నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ
రాజీవ్‌కుమార్ ఉపాధ్యక్షుడిగా నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 6న ఆమోదం తెలిపారు. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్‌లను నీతి ఆయోగ్‌లో ఎక్స్ అఫీషియో సభ్యునిగా నియమించారు. కాగా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, తవార్‌చంద్ గెహ్లాట్, ఇంద్రజిత్ సింగ్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. నీతి ఆయోగ్‌లో ప్రస్తుతం శాశ్వత సభ్యులుగా ఉన్న వీకే సారస్వత్, రమేష్ చంద్, వీకే పాల్‌లు కొనసాగనున్నారు. అయితే, 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ ఏర్పాటైనప్పుడు శాశ్వత సభ్యుడిగా ఉన్న వివేక్ దెబ్రోయ్‌కు ఉద్వాసన పలికారు.
Published date : 07 Jun 2019 05:52PM

Photo Stories