Skip to main content

ఎన్‌ఎస్‌టీఎల్ స్వర్ణోత్సవాల్లో వెంకయ్య

జాతీయ నావికా సమర శాస్త్ర, సాంకేతిక ప్రయోగశాల (ఎన్‌ఎస్‌టీఎల్) స్వర్ణోత్సవాల్లో భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌టీఎల్‌లోని మహాపాత్ర మానస్ ఆడిటోరియంలో ఆగస్టు 28న నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. అనంతరం జూబ్లీ పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. ఎన్‌ఎస్‌టీఎల్ రూపొందించిన ‘సహాయక్-ఎన్‌జీ సిస్టమ్’ను భారత నావికాదళానికి అప్పగించారు. అలాగే ఎన్‌ఎస్‌టీఎల్ టెక్నికల్ ఎగ్జిబిషన్‌ను వెంకయ్య ప్రారంభించారు.

ఎన్‌ఎస్‌టీఎల్ స్వర్ణోత్సవాల్లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎన్‌ఎస్‌టీఎల్ ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ డెరైక్టర్‌గా డాక్టరు ఓఆర్ నందగోపన్ ఉన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జాతీయ నావికా సమర శాస్త్ర, సాంకేతిక ప్రయోగశాల (ఎన్‌ఎస్‌టీఎల్) స్వర్ణోత్సవాలు
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 29 Aug 2019 05:38PM

Photo Stories