ఏహెచ్‌ఎఫ్ ఉపాధ్యక్షుడిగా ముస్తాక్ ఎన్నిక
Sakshi Education
హాకీ ఇండియా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ముస్తాక్ అహ్మద్, అసిమా అలీలకు అరుదైన గౌరవం దక్కింది.
ఆసియా హాకీ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ముస్తాక్, కార్యనిర్వాహక బృందం సభ్యురాలిగా అసిమా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 22న జపాన్‌లోని గిఫు నగరంలో జరిగిన సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. ముస్తాక్ అహ్మద్‌కు ఉపాధ్యక్ష పదవితోపాటు కార్యనిర్వాహక బోర్డులో సభ్యత్వమూ దక్కింది. నాలుగేళ్ల పాటు వీరు ఈ పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తారు. ముస్తాక్, అసిమాలకు హాకీ ఇండియా శుభాకాంక్షలు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఏహెచ్‌ఎఫ్ ఉపాధ్యక్షుడిగా ముస్తాక్ ఎన్నిక
ఎవరు: ముస్తాక్ అహ్మద్
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎక్కడ : జపాన్‌లోని గిఫు నగరం
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఏహెచ్‌ఎఫ్ ఉపాధ్యక్షుడిగా ముస్తాక్ ఎన్నిక
ఎవరు: ముస్తాక్ అహ్మద్
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎక్కడ : జపాన్‌లోని గిఫు నగరం
Published date : 23 Feb 2019 06:11PM