Skip to main content

ఏఎస్‌ఐ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా అనుపమ

ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) తొలి మహిళా ప్రెసిడెంట్‌గా డాక్టర్ జీసీ అనుపమ ఎన్నికయ్యారు. దీంతో అనపమ మూడేళ్లపాటు ఏఎస్‌ఐ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగనున్నారు.
  బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆో్టఫ్రిజిక్స్‌లో డీన్, సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అనుపమ.. సూపర్‌నోవాపై పరిశోధనలు చేశారు. ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పత్రిక ఎడిటర్‌గానూ వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని హవాయిలో 30 మీటర్ల అతిపెద్ద టెలీస్కోప్‌ను నెలకొల్పడంలో కీలకంగా వ్యవహరించిన అంతర్జాతీయ బృందంలోని భారతీయ నిపుణులకు నేతృత్వం వహించారు. లఢఖ్‌లోని లెహ్‌లో నెలకొల్పిన హిమాలయన్ టెలిస్కోప్ ప్రాజెక్టు ఇన్‌చార్జిగా కూడా ఆమె పనిచేశారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన టెలిస్కోప్‌గా ఇది నిలిచింది.
 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
ఏఎస్‌ఐ తొలి మహిళా ప్రెసిడెంట్ త
 ఎప్పుడు  : ఫిబ్రవరి 18
 ఎవరు  : డాక్టర్ జీసీ అనుపమ
Published date : 19 Feb 2019 04:37PM

Photo Stories