ఏ సంవత్సరం నాటికి పార్లమెంటు నూతన భవన నిర్మాణం పూర్తి కానుంది?
Sakshi Education
పార్లమెంటు నూతన భవన నిర్మాణం 2020, డిసెంబర్‌లో మొదలుపెట్టి 2022 అక్టోబర్ నాటికి పూర్తిచేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అధికారులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తెలిపారు.
పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అక్టోబర్ 23న సమీక్ష సమావేశం సందర్భంగా అధికారులు ఈ మేరకు వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి కూడా పాల్గొన్నారు.
భవన నిర్మాణ పనుల పర్యవేక్షణకు లోక్‌సభ సచివాలయ అధికారులు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ, సీపీడబ్ల్యూడీ, ఎన్‌డీఎంసీ, అర్కిటెక్ట్‌లు సభ్యులుగా స్పీకర్ ఓం బిర్లా ఒక కమిటీని నియమించారు.
చదవండి: పార్లమెంట్ భవనాల నిర్మాణ బాధ్యతలను గెలుచుకున్న సంస్థ? ప్రాజెక్టు నిర్మాణాల ఆర్కిటెక్చర్‌ను ఏ సంస్థ సమకూరుస్తోంది?

Published date : 24 Oct 2020 07:09PM