Skip to main content

ఏ రెండు దేశాల మధ్య ఇండ్‌సోమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటైంది?

భారత్, సోమాలియా మధ్య వ్యాపార సంబంధాలు, వాణిజ్యం పెంపుదల లక్ష్యంగా ఇండ్‌సోమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెప్టెంబర్ 30న ప్రారంభమైంది.
Current Affairs
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చాంబర్ ఫౌండర్ వై.కిరణ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. లాభాపేక్షలేని, ప్రభుత్వేతర సంస్థ అయిన ఇండ్‌సోమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగుమతులు, దిగుమతులు, సాంకేతిక బదిలీ, సంయుక్త భాగస్వామ్య కంపెనీల ఏర్పాటుకు వేదికగా నిలవనుంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న సోమాలియాలో ఆధునిక సేవలకు అపార అవకాశాలు ఉన్నాయని వై.కిరణ్ పేర్కొన్నారు.

రూ. 4,500 కోట్లకు...
ఇటీవలి కాలంలో భారత్, సోమాలియా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ. 4,500 కోట్లకు చేరుకుంది. పెట్రోలియం, ఫిషరీస్ రంగాల్లో సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సోమాలియా భావిస్తోంది.

టెలిశాట్‌తో నెల్కో జట్టు
టాటా గ్రూప్ కంపెనీ నెల్కో, అంతర్జాతీయ శాటిలైట్ ఆపరేటర్ టెలిశాట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో టెలిశాట్ ఎల్‌ఈఓ శాటిలైట్ కనెక్టివిటీని అందించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని నెల్కో తెలిపింది. దీంతో మారుమూల ప్రాంతాల్లో కూడా డిజిటల్ సేవలందుతాయని పేర్కొంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఇండ్‌సోమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : వ్యాపారవేత్త వై.కిరణ్
ఎందుకు : భారత్, సోమాలియా మధ్య వ్యాపార సంబంధాలు, వాణిజ్యం పెంపుదల లక్ష్యంగా
Published date : 02 Oct 2020 10:58AM

Photo Stories