ఏ రాష్ట్రంలో స్పందన తరహా కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు?
‘స్పందన’ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పందన కార్యక్రమం పనితీరును పరిశీలించడానికి కర్ణాటక అధికారుల బృందం మార్చి 22న ఏపీలో పర్యటించింది.
ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్కు...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు సమీపంలో ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు మార్చి 22న వెల్లడించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికే ఇక్కడున్న 7 ఏరోస్పేస్ పార్కులకు ఇది అదనమని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘స్పందన’ స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ అమలు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : కర్ణాటక ప్రభుత్వం
ఎక్కడ : కర్ణాటక
ఎందుకు : ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడానికి