Skip to main content

ఏ రాష్ట్రంలో నిర్మించిన మూడు పెట్రోలియం ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు?

బిహార్ రాష్ట్రంలో రూ.900 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన మూడు పెట్రోలియం ప్రాజెక్టుల్ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న జాతికి అంకితం చేశారు.
Current Affairs
పారాదీప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్టు, బంకా, చంపరాన్‌లో రెండు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) బాటిలింగ్ ప్లాంట్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... సరికొత్త భారత్, సరికొత్త బిహార్ లక్ష్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.

మధ్యప్రదేశ్‌లో గృహ ప్రవేశాలు...
మధ్యప్రదేశ్‌లో ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై-గ్రామీణ్)లో భాగంగా పూర్తి చేసిన 1.75 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలను సెప్టెంబర్ 12న ప్రధాని మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించి ప్రసంగించారు. పీఎంఏవై-గ్రామీణ్ కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ సరాసరి సమయం 125 రోజుల నుంచి లాక్‌డౌన్ సమయంలో 45-60 రోజులకు తగ్గిపోయి ందని ప్రధాని తెలిపారు. సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికులు ఇళ్ల పనుల్లో పాలుపంచుకోవడం కూడా ఇందుకు దోహదపడిందన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మూడు పెట్రోలియం ప్రాజెక్టులు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బిహార్
Published date : 19 Sep 2020 11:45AM

Photo Stories