ఏ పథకంలో భాగంగా అదనపు ఆహార ధాన్యాలు పంపిణీ చేయనున్నారు?
Sakshi Education
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనలో భాగంగా జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులకు అదనపు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేయనున్నట్లు ఏప్రిల్ 23న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ శాఖ ప్రకటించింది.
దేశంలో కొనసాగుతున్న కరోనా ఆంక్షల నేపథ్యంలో కేంద్ర తాజా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం... సుమారు 80 కోట్లమంది లబ్ధిదారులకు ప్రస్తుతం అందిస్తున్న ఆహార ధాన్యాలతో పాటు అదనంగా నెలకు 5 కిలోలు ఉచితంగా అందించనున్నారు. ఈ నిర్ణయం 2021, మే, జూన్ నెలల్లో అమలులో ఉండనుంది. ఇందుకు అవసరమైన çరూ.26 వేల కోట్లను కేంద్రమే భరించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులకు 5 కిలోల అదనపు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : దేశ వ్యాప్తంగా...
ఎందుకు : దేశంలో కొనసాగుతున్న కరోనా ఆంక్షల నేపథ్యంలో...
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులకు 5 కిలోల అదనపు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : దేశ వ్యాప్తంగా...
ఎందుకు : దేశంలో కొనసాగుతున్న కరోనా ఆంక్షల నేపథ్యంలో...
Published date : 24 Apr 2021 06:23PM