Skip to main content

ఏ జిల్లాలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు కానుంది?

ఈఎంసీ–2 పథకం కింద వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ) ఏర్పాటు కానుంది.
Current Affairs
ఈ క్లస్టర్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు ఇస్తూ మార్చి 22న ఉత్తర్వులు జారీచేసింది. 540 ఎకరాల్లో మొత్తం రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రాంట్‌ రూపంలో రూ.350 కోట్లు ఇవ్వనుంది. ఈ క్లస్టర్‌ ద్వారా రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

యాంకర్‌ కంపెనీగా డిక్సన్‌...
వైఎస్సార్‌ ఈఎంసీలో యాంకర్‌ కంపెనీగా డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 70 ఎకరాలు డిక్సన్‌ టెక్నాలజీస్‌కు కేటాయిస్తారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ) ఏర్పాటుకు అనుమతి
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : కొప్పర్తి, వైఎస్సార్‌ కడప జిల్లా
ఎందుకు : రూ.పదివేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని
Published date : 23 Mar 2021 06:17PM

Photo Stories