ఏ ఏడాదిని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ఎఫ్‌ఏవో ప్రకటించింది?
Sakshi Education
అంతర్జాతీయ సంస్థ ‘‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏవో)’ ఏర్పాటై 75 ఏళ్లు అయిన సందర్భంగా అక్టోబర్ 16న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ రూ.75 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ‘భారతదేశ వినతితో 2016 ఏడాదిని అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరంగా, 2023 ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ఎఫ్‌ఏఓ ప్రకటించింది’ అని పేర్కొన్నారు.
17 బయో ఫోర్టిఫైడ్ వంగడాలు విడుదల
పోషకాహార లోపాలను అధిగమించేందుకు భారత ప్రభుత్వం సిద్ధం చేసిన 17 బయో ఫోర్టిఫైడ్ వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. స్థానిక వంగడాలు, రైతులు అభివృద్ధి చేసిన వంగడాల సాయంతో ఈ కొత్త వెరైటీలను సిద్ధం చేశారు. జాతికి అంకితం చేసిన వాటిల్లో గోధుమ వంగడాలు ఐదు ఉండగా.. మొక్కజొన్న వంగడాలు మూడు, రాగులు, వేరుశనగ రెండు చొప్పున ..వరి, సామలు, ఆవాలు, కంద వంగడాలు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇంకో వంగడం వివరాలు తెలియాల్సి ఉంది.
ఓలిక్ ఆసిడ్‌ను ఏ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు?
నూతన వంగడాల్లో రెండింటిని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) అభివృద్ధి చేసింది. గిర్నార్ -4, గిర్నార్ -5 అని పిలుస్తున్న ఈ రెండు వేరుశనగ వంగడాల్లో ఓలిక్ ఆసిడ్ మోతాదు ఎక్కువ. సబ్బులు, ఫార్మా, వస్త్ర పరిశ్రమల్లో ఓలిక్ ఆసిడ్‌ను ఉపయోగిస్తారు.

Published date : 17 Oct 2020 05:21PM