Skip to main content

ఏ దేశ మాజీ అధ్యక్షుడికి 15నెలల జైలు శిక్షను విధించారు?

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా(79)కు ఆదేశ అత్యున్నత న్యాయస్థానం 15నెలల జైలు శిక్షను విధించింది.
Current Affairs
జుమా పదవీ కాలంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జరుగుతన్న విచారణకు హాజరవ్వాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కారం కింద ఈ శిక్షను విధించింది. 2009–18 కాలంలో జుమా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. తాజాగా కోర్టు ధిక్కార శిక్ష విధింపు సమయంలో సైతం జూమా కోర్టులో లేరు. ఏదైనా పోలీసు స్టేషన్‌లో లొంగిపోయేందుకు ఆయనకు కోర్టు ఐదురోజుల సమయం ఇచ్చింది. ఈ సమయంలో లొంగుబాటుకు రాకుంటే అరెస్టుకు ఆదేశాలిస్తారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్‌ రామాఫోసా ఉన్నారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : 15నెలల జైలు శిక్ష విధింపబడిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు
ఎప్పుడు : జూన్‌ 29
ఎవరు : జాకబ్‌ జుమా(79)
ఎక్కడ : దక్షిణాఫ్రికా
ఎందుకు : విచారణకు హాజరవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా పట్టించుకోకపోవడంతో...
Published date : 30 Jun 2021 06:01PM

Photo Stories