Skip to main content

ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసు రద్దు

ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఆగస్టు 12న భారత్ ప్రకటించింది.
జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్-ఢిల్లీ బస్ సర్వీసులను పాకిస్తాన్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ తెలిపింది. ఇప్పటికే భారత్-పాక్‌ల మధ్య నడిచే సంరతా ఎక్స్‌ప్రెస్, థార్ ఎక్స్‌ప్రెస్‌లను పాకిస్తాన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసు ప్రారంభమైంది. అయితే 2001లో భారత పార్లమెంటు భవనంపై దాడి జరిగిన తర్వాత బస్సు సర్వీసులను నిలిపివేయడం జరిగింది. అనంతరం 2003 జూలైలో బస్సు సర్వీసు పునఃప్రారంభమైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసు రద్దు
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : భారత్
ఎందుకు : లాహోర్-ఢిల్లీ బస్ సర్వీసులను పాకిస్తాన్ రద్దు చేసిన నేపథ్యంలో
Published date : 13 Aug 2019 05:23PM

Photo Stories