Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, డిసెంబ‌ర్ 26th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu December 26th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Snow Storm: అంధకారంలో అగ్రరాజ్యం.. మంచు తుఫాను విశ్వరూపం
అమెరికాలో మంచు తుఫాను విశ్వరూపం చూపుతోంది. దేశంలో 3,500 కిలోమీటర్ల పొడవున బీభత్సం సృష్టిస్తోంది. వాతావరణ శాఖ అనుమానించిట్టుగానే ఆర్కిటిక్‌ బ్లాస్ట్‌ కాస్తా శక్తిమంతమైన బాంబ్‌ సైక్లోన్‌గా రూపాంతరం చెందుతోంది. దాని దెబ్బకు చాలా రాష్ట్రాల్లో డిసెంబ‌ర్ 23న ఉష్ణోగ్రతలు మైనస్‌ 45 డిగ్రీల కంటే కూడా దిగువకు పడిపోయాయి! గడ్డ కట్టించే చలికి 100 కిలోమీటర్ల పై చిలుకు వేగంతో వీసే అతి శీతల గాలులు తోడయ్యాయి. దాంతో జీవితంలో కనీవినీ ఎరుగనంతటి ఎముకలు కొరికే చలి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తూర్పు అమెరికాలో పరిస్థితి భయానకంగా ఉంది. పెను గాలుల ధాటికి చెట్లు, కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. దాంతో దేశంలో అత్యధిక ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. 20 లక్షలకు పైగా ఇళ్లు, కార్యాలయాల్లో అంధకారం అలముకుంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.

US Bomb Cyclone: మంచు గుప్పెట్లో అమెరికా.. మైనస్‌ 30కి ఉష్ణోగ్రతలు

మంచు తుఫానుతో 20 కోట్ల మందికి పైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. క్రిస్మస్‌ విరామ సమయంలో ఇంటి నుంచి బయట కాలు పెట్టే వీల్లేక, చలి నుంచి తప్పించుకునే మార్గం లేక వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. భరించలేని చలి కారణంగా న్యూయార్క్‌ తదితర రాష్ట్రాల్లో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు! 13 రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితి అమల్లోకి రావడం తెలిసిందే. దీన్ని దేశ చరిత్రలో కనీవినీ ఎరగని వాతావరణ విపత్తుగా భావిస్తున్నారు. పొరుగు దేశం కెనడాలో కూడా పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ ఒంటారియో, క్యుబెక్‌ తదితర ప్రాంతాలు కూడా భరించలేని చలి, కరెంటు అంతరాయాలతో అతలాకుతలమవుతున్నాయి. బ్రిటిష్‌ కొలంబియా నుంచి న్యూఫౌండ్‌ లాండ్‌ దాకా కెనడాలోని మిగతా చోట్ల కూడా మంచు తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో విమాన సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. 

Covid Cases: 20 రోజుల్లోనే 25 కోట్ల మందికి కరోనా 

చైనాలో ప్రజాందోళనలకు తలొగ్గి జీరో కొవిడ్‌ పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటి నుంచీ ఒమిక్రాన్‌ వేరియంట్లు దేశమంతటా కార్చిచ్చు కంటే వేగంగా వ్యాపిస్తున్నాయి. డిసెంబర్‌ 1–20 తేదీల మధ్య కనీసం 25 కోట్ల మంది కరోనా బారిన పడ్డట్టు జాతీయ ఆరోగ్య కమిషన్‌ నుంచి లీకైన డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది! దాంతో రోగులతో ఆస్పత్రులు, శవాలతో మార్చురీలు నిండిపోతున్నాయి. వాటిపై భారం తగ్గించేందుకు ఇంటర్నెట్‌ ఆస్పత్రి సేవలను ప్రభుత్వం అనుమతించింది. వీలైనంత వరకూ ఆన్‌లైన్‌లో వైద్య సాయం పొందాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అత్యవసర కరోనా మందులకు చాలాచోట్ల తీవ్ర కొరత నెలకొంది. దాంతో బ్లాక్‌ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి! 

New Variant BF7 : ఈ కొత్త వేరియంట్‌తో వీరికే ముప్పు ఎక్కువ‌.. ఎందుకంటే...?
సిబ్బందికీ కరోనా! 
చైనాలో పలు నగరాల్లో సగటున రోజుకు లక్షకు పై చిలుకు చొప్పున కేసులు వెలుగు చూస్తున్నాయి! తూర్పున షాన్‌డాంగ్‌ ప్రావిన్సులో క్విండావో నగరంలోనైతే రోజుకు ఏకంగా 5 లక్షల మంది కరోనా బారిన పడుతున్నారని నగర హెల్త్‌ కమిషన్‌ చీఫ్‌ బో తావో చెప్పారు! మున్ముందు పరిస్థితి మరింత విషమించేలా కనిపిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. దక్షిణాదిన గువాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో డాంగువాన్‌ నగరంలోనూ రోజుకు 3 లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. రోగుల్లో చాలావరకు వృద్ధులేనని తెలుస్తోంది. మరోవైపు చాలాచోట్ల వైద్య సిబ్బంది కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డట్టు సమాచారం. అయినా ఒకవైపు చికిత్స తీసుకుంటూనే వారంతా విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.

Sitiveni Rabuka: ఫిజీ ప్రధానిగా రబుకా
ఫిజీ ప్రధానిగా మాజీ మిలటరీ కమాండర్‌ సిటివెని రబుకా (74) డిసెంబ‌ర్ 24న ప్రమాణం చేశారు. పీపుల్స్‌ అలయెన్స్ పార్టీకి చెందిన ఆయన మరో రెండు పార్టీలతో కలిసి సంకీర్ణం ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ 14న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. 16 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న ఫ్రాంక్‌ బైనిమరామ వైదొలిగేందుకు నిరాకరించడంతో ఉత్కంఠ కొనసాగింది. పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానంలో రబుకా ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఫిజీలో గత 35 ఏళ్లలో నాలుగుసార్లు సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)

Prachanda: నేపాల్‌ ప్రధానిగా ప్రచండ 
నేపాల్‌లో నెల రోజుల రాజకీయ అస్థిరతకు ఆదివారం తెర పడింది. మాజీ గెరిల్లా నాయకుడు, సీపీఎన్‌–మావోయిస్టు సెంటర్‌ చైర్మన్‌ పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ (68) కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. ఆయన డిసెంబ‌ర్ 26న ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు నాటకీయ పరిణామాల మధ్య నేపాలీ కాంగ్రెస్‌ సారథ్యంలోని ఐదు పార్టీల కూటమి నుంచి వైదొలిగిన ప్రచండ సీపీఎన్‌–యూఎంఎల్‌ తదితర పక్షాలతో జట్టు కట్టారు. 275 మంది ఎంపీలున్న పార్లమెంటులో ఆయన సారథ్యంలోని సంకీర్ణానికి 168 మంది మద్దతు సమకూరింది. ప్రధాని బాధ్యతలు చేపట్టడం ప్రచండకు ఇది మూడోసారి. ఆయనకు చైనా అనుకూలునిగా, భారత వ్యతిరేకిగా పేరుంది. 

Richard Verma: భారతీయ అమెరికన్‌ రిచర్డ్‌ వర్మకు కీలక పదవి
భారతీయ అమెరికన్‌ రిచర్డ్‌ వర్మ (54) అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్‌మెంట్, రీసోర్సెస్‌ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులు కానున్నారు. అధ్యక్షుడు బైడెన్‌ ఈ మేరకు ప్రతిపాదించారు. ఇందుకు సెనేట్‌ ఆమోదం తెలిపితే విదేశాంగ శాఖలో అత్యున్నత పదవి చేపట్టనున్న భారతీయ అమెరికన్‌ వర్మ అవుతారు. ఆయన 2015–17 మధ్య భారత్‌లో అమెరికా రాయబారిగా కూడా పనిచేశారు. ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం మాస్టర్‌ కార్డ్‌ సంస్థ చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్‌గా, గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా పని చేస్తున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

PAN Card: ఆధార్​ లింక్​ లేని పాన్‌కార్డు వేస్ట్‌
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఆధార్‌తో అనుసంధానంకాని పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌(పాన్‌) కార్డులు క్రియాశీలకంగా ఉండబోవని ఆదాయ పన్ను శాఖ ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొంది. ‘ఆదాయపన్ను చట్టం–1961 ప్రకారం ఎలాంటి మినహాయింపుల పరిధిలోకిరాని పాన్‌ కార్డు వినియోగదారులు తమ కార్డును ఆధార్‌తో వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆధార్‌తో అనుసంధానించని పాన్‌ కార్డులు ఏప్రిల్ ఒకటి నుంచి మనుగడలో ఉండవు. వాటిని ఇన్‌ఆపరేటివ్‌గా భావించాలి’ అని ఐటీ శాఖ స్పష్టంచేసింది. పాన్‌ కార్డు మనుగడలో లేకపోతే ఐటీ చట్టం ప్రకారం సంబంధిత కార్డు హోల్డర్‌ చట్టపరంగా పలు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఇప్ప‌టికే పేర్కొంది. క్రియాశీలకంగాలేని పాన్‌ కార్డుతో ఐటీ రిటర్న్‌లు దాఖలుచేయడం వీలుకాదు. పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు తిరిగిరావు. కట్టాల్సిన పన్నులకు మించి అధికంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ) తప్పనిసరి అయిన బ్యాంక్‌లు, ఆర్థిక సంబంధ వెబ్‌సైట్లలో పాన్‌కార్డు ఖచ్చితం చేసిన నేపథ్యంలో ఇకపై వారు వాటి ద్వారా నగదు బదిలీ, ఆర్థిక లావాదేవీలు జరపడం దాదాపు అసాధ్యం. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)

సాధారణంగా ఐటీ శాఖకు సంబంధించిన విధానపర నిర్ణయాలను సీబీడీటీనే నిర్ణయిస్తుంది. 2017 మే నెలలో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఒక నోటిఫికేషన్‌లో ఆ ‘మినహాయింపు కేటగి రీ’ని పేర్కొంది. అస్సాం, జమ్మూకశ్మీర్, మేఘాల యలో ఉండేవారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఐటీ చట్టం–1961 ప్రకారం స్థానికే తరులు, 80 ఏళ్లు దాటిన వారు, భారతపౌరులు కాని వారికి ఈ మినహాయింపు ఉంది.

అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు 
అశ్రునయనాల మధ్య సినీనటుడు కైకాల సత్యనారాయణకు కుటుంబ సభ్యులు, అభిమానులు తుదివీడ్కోలు పలికారు. ఆయన పార్థివదేహానికి రాయదుర్గంలోని మహాప్రస్థానంలో డిసెంబ‌ర్ 24న‌ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో పోలీసు బందోబస్తు, లాంఛనాలతో ఆయన పార్థివదేహాన్ని మహాప్రస్థానానికి తీసుకొచ్చారు. సత్యనారాయణ చితికి ఆయన పెద్ద కుమారుడు రామారావు నిప్పు అంటించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశం మేరకు కైకాల అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించి గాలిలోకి మూడుసార్లు తుపాకులతో కాల్పులు జరిపారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

Veer Bal Diwas: బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగల్ బలిదానానికి గుర్తుగా ‘వీర్ బాల్ దివస్’ 1704వ సంవత్సరంలో మొగలు నవాబ్ అయిన వజీర్ ఖాన్ మతం మారాలంటూ ఇద్దరు షహజాదేలను చిత్రహింసలు పెట్టారు. అయినా ధర్మాన్ని మార్చుకునేందుకు 9 ఏళ్ల జోరావర్ సింగ్, 7 ఏళ్ల ఫతేసింగ్ నిరాకరించారు. 1704 డిసెంబర్ 26న వీరిద్దరు బలిదానం చెందారు. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగల్ సిక్కుల పదవ గురువు గురుగోవింద్ సింగ్ చిన్న‌ కుమారులు(సాహెబ్‌‌జాదేలు). వీరి ధైర్య, సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న ‘వీర బాల్ దివస్’ కార్యక్రమం నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 26న‌(సోమవారం) ఢిల్లీలో వీర బాల్ దివస్‌ను పురస్కరించుకుని ఘనంగా ‘షాబాద్ కీర్తన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. 2022 జనవరి 9న శ్రీ గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Shahid Afridi: పాకిస్తాన్‌ సెలక్టర్‌గా షాహిద్‌ అఫ్రిది  
మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదిని కొత్త సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఎంపిక చేసింది. ముగ్గురు సభ్యుల ఈ కమిటీలో అఫ్రిదితో పాటు మరో ఇద్దరు మాజీ ఆటగాళ్లు అబ్దుల్‌ రజాక్, ఇఫ్తికార్‌ అంజుమ్‌ కూడా ఉన్నారు. త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగబోయే 2 టెస్టు, 3 వన్డేల సిరీస్‌ కోసం ఈ కమిటీ జట్టును ఎంపిక చేస్తుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన జట్టు ప్రదర్శనపై కూడా అఫ్రిది నేతృత్వంలోని కమిటీ సమీక్ష జరుపుతుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)

Indian Cuisine: భారతీయ వంటలకు జై
అత్యుత్తమ వంట విధానాలున్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానంలో నిలిచింది. ఇటలీ, గ్రీస్, స్పెయిన్‌ తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. వంటలో వాడే పదార్థాలు, దినుసులు, పానీయాలపై ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ర్యాంకులు దక్కాయి. 2022కు గాను టేస్ట్‌ అట్లాస్‌ చేపట్టిన ఈ ఓటింగ్‌లో భారత్‌కు 4.54 పాయింట్లు వచ్చాయి. జపనీస్‌ వంటకాలు నాలుగో స్థానంలో ఉన్నాయి. టేస్ట్‌ అట్లాస్‌ అవార్డ్స్‌ 2022 ఫలితాల ప్రకారం..400కు పైగా భారత వంటదినుసుల్లో గరం మసాలా, ఘీ, మలాయ్, బట్టర్‌ గార్లిక్‌ నాన్, కీమా తదితరాలకు అగ్రస్థానం దక్కింది. దేశంలో మంచి ఆదరణ ఉన్న 450 హోటళ్లలో ముంబైలోని ప్రముఖ శ్రీ థాకర్‌ భోజనాలయ్, బెంగళూరులోని కారవల్లి, ఢిల్లీలోని బుఖారా, దమ్‌ ఫఖ్త్, గురుగ్రామ్‌లోని కొమోరిన్‌ రెస్టారెంట్లకు అత్యధిక ఓట్లు పడ్డాయి. అయితే, ప్రపంచదేశాల్లో ఆదరణ ఉన్న చైనా వంటకాలకు 11వ స్థానం, పేరున్న థాయ్‌ వంటకాలకు 30వ స్థానం దక్కడంపై నెటిజన్లు అభ్యంతరం తెలిపారు. కాగా, ఈ జాబితాలో అమెరికా 8వ, ఫ్రాన్సు 9వ ర్యాంకుల్లో నిలిచాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
 
Chalapathi Rao: విలక్షణ నటుడు చలపతిరావు కన్నుమూత 
ప్రతి నాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్య నటుడిగా ప్రేక్షకులను మెప్పించిన సీనియర్‌ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) డిసెంబ‌ర్ 24న‌ రాత్రి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న 1200 పైగా చిత్రాల్లో నటించారు.  
కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రులో మణియ్య, వియ్యమ్మ దంపతులకు 1944 మే 8న చలపతిరావు జన్మించారు. నందమూరి తారక రామారావు అంటే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తాను కూడా హీరో కావాలని అవకాశాల్ని వెతుక్కుంటూ మద్రాస్‌ (చెన్నై) వెళ్లారు చలపతిరావు. సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ‘గూఢచారి 116’ (1966) ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు చలపతిరావు. ఆ తర్వాత ‘సాక్షి, బుద్ధిమంతుడు, టక్కరి దొంగ చక్కని చుక్క’ వంటి చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో ‘కథానాయకుడు’ (1969) సినిమాలో మున్సిపల్‌ కమిషనర్‌ పాత్ర చేశారు. ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగా కెరీర్‌ ఆరంభంలో ఐదారేళ్ల పాటు ఆయన సినిమాల్లోనే నటించారు చలపతిరావు.
హీరో కావాలని వెళ్లిన చలపతిరావుకి ఎక్కువగా విలన్‌ పాత్రలే వచ్చేవి. అయితే ‘దాన వీర శూర కర్ణ’ చిత్రం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమాలో ఐదు పాత్రల్లో నటించారాయన. కెరీర్‌ ఆరంభంలో ఎక్కువగా మానభంగం సన్నివేశాల్లో నటించారు చలపతిరావు. దాదాపు 90కి పైగా రేప్‌ సీన్స్‌లో నటించారాయన. అప్పటివరకు విలన్‌ పాత్రలు చేసిన చలపతిరావుని ‘నిన్నే పెళ్లాడతా’ (1996) సినిమా నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సాఫ్ట్‌ క్యారెక్టర్స్‌కు ఆయన న్యాయం చేయగలరనే నమ్మకం దర్శక–నిర్మాతల్లో కలిగించింది ఆ సినిమా. దీంతో ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత మంచి తండ్రి, బాబాయ్‌ పాత్రలు కూడా ఆయన్ని వరించాయి. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో పాటు నేటి తరం యువ హీరోల సినిమాల్లోనూ ఆయన వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.  ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో దాదాపు 1200లకుపైగా సినిమాల్లో నటించారు చలపతిరావు. తనయుడు రవిబాబు దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారాయన. అయితే అనుకోని విధంగా హఠాన్మరణం పొందారు. 

ప్రముఖ సినీనటుడు సీనియర్‌ నటుడు కైకాల కన్నుమూత.. ఈయ‌న జీవిత ప్ర‌స్థానం ఇలా..
☛ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చలపతిరావు ఆర్‌సీ క్రియేషన్స్‌ అనే బ్యానర్‌ స్థాపించి నిర్మాతగా మారారు. తొలి చిత్రంగా బాలకృష్ణతో ‘కలియుగ కృష్ణుడు’ నిర్మించారు. ఆ తర్వాత ‘కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంట్‌గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి’ వంటి చిత్రాలు నిర్మించారు.   
☛ చలపతిరావుకు 19 ఏళ్లకే ఇందుమతితో పెళ్లయింది. వీరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. తన 28వ ఏట జరిగిన ఓ ప్రమాదంలో భార్య ఇందుమతిని కోల్పోయారు చలపతిరావు. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడగా, కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు.

Vikram Gokhale: బాలీవుడ్‌ నటుడు విక్రమ్‌ గోఖలే కన్నుమూత

Published date : 26 Dec 2022 06:33PM

Photo Stories