దుబాయ్ వేదికగా ఆసియా కప్: బీసీసీఐ
Sakshi Education
2020, సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ వేదిక మారింది.
ఈ టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా.. పాక్‌లో ఆడలేమంటూ బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో మార్పు అనివార్యమైంది. ఈ టోర్నీ యూఏఈలోని దుబాయ్‌లో జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఫిబ్రవరి 28న వెల్లడించాడు. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఇరు జట్ల మధ్య 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం తలపడుతున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా కప్ 2020
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా కప్ 2020
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ
ఎక్కడ : దుబాయ్, యూఏఈ
Published date : 29 Feb 2020 05:45PM