డ్రోన్ల రిజిస్ట్రేషన్‌పై విమానయాన శాఖ ఆదేశాలు
Sakshi Education
దేశంలో డ్రోన్లను కలిగి ఉన్న వ్యక్తులందరూ 2020, జనవరి 31లోగా స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోవాలని కేంద్ర విమానయాన శాఖ జనవరి 13న తెలిపింది.
నిర్దేశిత గడువులోగా రిజిస్టర్ చేసుకోని డ్రోన్ల ఆపరేటర్లపై ఐపీసీ సెక్షన్, ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆన్‌లైన్ విధానంలో డ్రోన్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. డీజీసీఏ నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇరాన్ సైనిక దళ కమాండర్ ఖాసీం సులేమానీపై అమెరికా డ్రోన్ సాయంతో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ ఆపరేటర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రోన్ల రిజిస్ట్రేషన్‌పై ఆదేశాలు
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : కేంద్ర విమానయాన శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
మాదిరి ప్రశ్నలు
ఇరాన్ సైనిక దళ కమాండర్ ఖాసీం సులేమానీపై అమెరికా డ్రోన్ సాయంతో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ ఆపరేటర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డ్రోన్ల రిజిస్ట్రేషన్‌పై ఆదేశాలు
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : కేంద్ర విమానయాన శాఖ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
మాదిరి ప్రశ్నలు
1. ప్రస్తుతం కేంద్ర గృహనిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి(స్వతంత్య్ర హోదా)గా ఎవరు ఉన్నారు?
1. మన్సుఖ్ మాండవ్యా
2. ప్రహ్లాద్ సింగ్ పటేల్
3. రాజ్ కుమార్ సింగ్
4. హర్దీప్ సింగ్ పూరి
- View Answer
- సమాధానం : 4
Published date : 14 Jan 2020 04:17PM