Skip to main content

దక్షిణ కొరియాలో అధికార పార్టీ విజయం

సియోల్‌: కరోనా కట్టడిలో అద్భుతమైన ప్రతిభాపాటవాలు చూపించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్ ఆధ్వర్యంలో అధికార డెమొక్రాటిక్‌ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది.
Current Affairs

మొత్తం 300 స్థానాలున్న జాతీయ అసెంబ్లీలో మూన్‌ నేతృత్వంలో లెఫ్ట్‌ పార్టీల కూటమికి 180 సీట్లు వస్తే, ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ యునైటెడ్‌ కూటమి 103 స్థానాలు దక్కించుకుంది. 1987 తర్వాత దక్షిణ కొరియాలో ఏ పార్టీకి ఈ స్థాయి విజయం దక్కలేదు. కరోనాని అరికట్టడంలో అధ్యక్షుడు చూపించిన పనితీరుకే ప్రజలు మూన్‌కే మళ్లీ పట్టం కట్టారు.


టీకా ఒక్కటే మార్గం..

కోవిడ్‌ నివారణకు టీకా అభివృద్ధి చేస్తేనే ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశముందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్‌ స్పష్టం చేశారు. ‘టీకా ఒక్కటే ప్రపంచంలో సాధారణ పరిస్థితులున్న భావనను తీసుకురాగలదు. దీంతో కోటానుకోట్ల డాలర్ల మొత్తం ఆదా అవడమే కాకుండా విలువైన ప్రాణాలు మిగుల్చుకోవచ్చు’’అని ఆయన ఆఫ్రికాదేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు లక్షల కోట్ల డాలర్ల విరాళాలు సేకరించాలని తాను మార్చి 25న పిలుపునివ్వగా ఇప్పటివరకూ ఇందులో 20 శాతం మొత్తం అందిందని తెలిపారు.
Published date : 17 Apr 2020 06:37PM

Photo Stories