డిజిటల్ వినియోగంలో లింగ వివక్ష
Sakshi Education
భారత్‌లో ఆడపిల్లలు మొబైల్ ఫోన్ వాడకంపై అంతర్లీనంగా నిషేధం కొనసాగుతోందని <b>సెంటర్ ఫర్ క్యాటలైజింగ్ చేంజ్(సీ3) </b>అనే స్వచ్ఛంద సంస్థ <b>డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్తో</b> కలిసి నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
దేశంలోని బాలికలకు ఉన్న డిజిటల్ యాక్సెస్‌ని అంచనా వేసేందుకు 10 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో 4,100 మందిని ఈ అధ్యయనంలో భాగస్వాములను చేశారు. జనవరి 23న సర్వేను విడుదల చేశారు. సర్వేలోని ముఖ్యాంశాలు...
- దేశంలో 42 శాతం మంది కిశోర బాలికలకు కేవలం రోజుకి గంటకన్నా తక్కువ సమయం మొబైల్ ఫోన్‌ని వాడే అవకాశం ఇస్తున్నారు.
- అత్యధిక మంది తల్లిదండ్రులు ఆడపిల్లల మొబైల్ వాడకాన్ని సురక్షితం కాదని భావిస్తున్నారు.
- బాలబాలికల మధ్య మొబైల్ వినియోగం విషయంలో వ్యత్యాసం జెండర్ వివక్ష కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది.
- ప్రధానంగా హరియాణా రాష్ట్రంలో బాలురకి మొబైల్ వాడకంలో ఉన్నంత వెసులుబాటు ఆడపిల్లలకి లేదు.
- కర్నాటకలో బాలికలకు మిగిలిన రాష్ట్రాలకంటే కొంత ఎక్కువగా మొబైల్ వాడే అవకాశం లభిస్తోంది.
- 71 శాతం మంది బాలికలకు అసలు మొబైల్ ఫోన్ అందుబాటులో లేదు. అందుకు ఆర్థిక స్థోమత లేకపోవడమే కారణం.
Published date : 26 Jan 2021 07:56PM